Australia : ఆస్ట్రేలియాలో అరుదైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. కాకపోతే, ఇది చాలామందిని భయపెట్టింది కూడా. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోయాయి. అది కూడా బ్లడ్ రెడ్ కలర్. అచ్చం రక్తంలాగే ఎరుపు రంగులోకి వాతావరణం మారిపోవడంతో స్థానికులకు వింత అనుభవం ఎదురైంది.
ఈ ఘటన శుక్రవారం ఆస్ట్రేలియాలోని డెన్హామ్ అనే టూరిస్ట్ పట్టణంతోపాటు షార్క్ బే, పిల్బారా ప్రాంతాల్లో జరిగింది. ఆకాశం పూర్తిగా రక్తపు ఎరుగు రంగులోకి మారిపోవడంతో ప్రతి దృశ్యం ఎర్రగానే కనిపించింది. నారెల్లె అనే ఉష్ణమండల సైక్లోన్ ప్రభావంతో ఇలా జరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది తీర ప్రాంతం. తీరాన్ని నారెల్లె తుఫాన్ సమీపించిన సమయంలో గాలి ప్రభావానికి ఐరన్ కలిసిన దుమ్ము అంతటా వ్యాపించడం, మబ్బుల్ని కమ్ముకోవడం వల్ల, సూర్యకాంతి ప్రభావంతో అంతా ఎర్రగా మారింది. కాంతి వికిరణ చర్య ద్వారా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఈ కాంతిని నేరుగా చూసిన అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.
NO, that’s not a filter! ☁️🔴 The sky turned an eerie shade of red in Western Australia as dust filled the air ahead of Tropical Cyclone Narelle. pic.twitter.com/dCQ2hjFluI
— AccuWeather (@accuweather) March 28, 2026
కొందరు ఆనందం వ్యక్తం చేస్తే, మరికొందరు భయందోళనకు గురయ్యారు. ఎప్పుడో కానీ, ఇలాంటి దృశ్యాన్ని తాము చూడలేమని చాలా మంది అన్నారు. భూమిపై కాకుండా ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు అనిపించిందని అక్కడి వారు తెలిపారు. ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారాయి.