కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘కోబ్రా’ (Cobra). అజయ్ జ్ఞానముత్తు (Ajay Gnanamuthu) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఏఆర్ రెహమాన్ రీరికార్డింగ్ పనులు మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే రీరికార్డింగ్ పనులు పూర్తి కానున్నాయి.
కోబ్రా ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాల్సి ఉండగా.. పలు పనులు పెండింగ్‌లో ఉండటంతో..నిర్మాతలు కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారట. శ్రీనిధి ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ఈ చిత్రంలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, డైరెక్టర్ కేఎస్ రవికుమార్, మృణాళినీ రవి, మియా జార్జ్ కీ రోల్స్ పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్నిసెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన కోబ్రా పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. విక్రమ్ దీంతోపాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్‌తోపాటు గౌతమ్ మీనన్ డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం సినిమాలు చేస్తున్నాడు.
Cobra 🐍 pic.twitter.com/cGk5NN3PCi
— A.R.Rahman (@arrahman) August 3, 2022