Kamal Hasan | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, దేవాలయాలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం విజయ్ను అభినందించారు.
తమిళ కుటుంబాల ఆకాంక్షలను గౌరవిస్తూ, పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం విజయ్ తీసుకున్న ఈ చర్య అభినందనీయమని కమల్ హాసన్ పేర్కొన్నారు. మద్యం విక్రయాలు ప్రభుత్వ ప్రధాన విధి కాకూడదని, మద్యం ప్రవాహాన్ని నియంత్రించే బాధ్యతను మాత్రం ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతానికి 717 దుకాణాలను మూసివేయడం ద్వారా శుభారంభం జరిగిందని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతూ సంపూర్ణ నియంత్రణ దిశగా అడుగులు వేయాలని కోరారు.
வழிபாட்டுத்தலங்கள், கல்வி நிறுவனங்கள் மற்றும் பேருந்து நிலையங்களுக்கு அருகேயுள்ள மதுபான விற்பனைக் கடைகளை அகற்ற வேண்டுமென்பது தமிழ்க் குடும்பங்களின் எதிர்பார்ப்பாக இருந்த நிலையில், இந்த நடவடிக்கையை மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சர், தம்பி விஜய் @TVKVijayHQ அவர்கள் பதவிக்கு…
— Kamal Haasan (@ikamalhaasan) May 12, 2026