Unstoppable 4 | ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వచ్చే అన్‌స్టాపబుల్ షో బాలయ్యను అభిమానులను చాలా దగ్గర చేసింది. మాములుగా బాలయ్య అంటే ముక్కు మీద కోపం అని, ఊరికనే చిరాకుపడతాడని బయట జనం అనుకుంటుంటారు. కానీ పైకీ గంభీరంగా కనిపించినా.. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. నిజంగా బాలయ్య ఆఫ్ స్క్రీన్‌లో ఎంత సరదా మనిషో అన్‌స్టాపబుల్ షోతో క్లారిటీ వచ్చేసింది. తనకంటే పెద్ద వాళ్లను ఎలా గౌరవిస్తాడో.. చిన్నవాళ్లను అలానే ఆటపట్టిస్తుంటాడు. ఆ షోతో కొన్నేళ్లుగా బాలయ్యపై నెగెటీవ్ అభిప్రాయం ఉన్నవారు కూడా ఆయన్ని అభిమానించడం మొదలు పెట్టారు. అంతలా ఈ టాక్ షో జనాలను ఆకట్టుకుంది.
ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌పుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో తాజాగా నాలుగో సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ఎపిసోడ్లో ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu) వచ్చి సందడి చేశారు. అక్టోబరు 25 నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా (Aha) ప్రకటించింది. కాగా బాలాయ్య – చంద్రబాబుకు సంబంధించిన కొత్త ఎపిసోడ్ ప్రోమోను మీరు చూసేయండి.