‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌పై మళ్లీ రగడ
ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ముందు నుంచి కూడా కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత అక్కినేని కారెక్టర్ గురించి తమిళనాడులో చర్చతో పాటు రచ్చ కూడా జరుగుతుంది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ పై ముందు నుంచి కూడా కాంట్రవర్సీలు నడుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సమంత అక్కినేని కారెక్టర్ గురించి తమిళనాడులో చర్చతో పాటు రచ్చ కూడా జరుగుతుంది. కొందరు అందులో తప్పేముంది.. నటిగా అన్ని పాత్రలు చేయాలి అంటూ అండగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం తమిళమ్మాయి అయ్యుండి ఇలాంటి శ్రీలంకన్ టెర్రరిస్ట్ పాత్ర చేస్తావా.. సిగ్గు లేదా అంటూ సమంతను విమర్శిస్తున్నారు.
ఏకంగా నేషనల్ వైడ్ గా #ShameOnYouSamantha అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండ్ కూడా చేసారు. అయితే వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత అన్నీ మరిచిపోయారు. అందులో సమంత నటనకు అంతా ఫిదా అయిపోయారు. విమర్శించిన వాళ్లు కూడా సమంత నటన చూసి ఒక్కసారిగా మంత్రముగ్ధులు అయిపోయారు. అంత అద్భుతంగా నటించింది సమంత. అయితే తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లు ఇప్పుడు మరోసారి ఈ వెబ్ సిరీస్ పై ఇప్పుడు రచ్చ మొదలైంది.
ట్రైలర్ విడుదలైన తర్వాత నానా రచ్చ జరిగింది. దాంతో సిరీస్ విడుదలయ్యేంత వరకు కూడా పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు మేకర్స్. అయితే విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది. అన్నిచోట్ల నుంచి యూనానిమస్ రిపోర్ట్స్ రావడంతో పండగ చేసుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సమయంలో ట్విట్టర్ లో మళ్లీ నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. ఏకంగా అమెజాన్ ప్రైమ్ వీడియోనే బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద ఎత్తున నినదిస్తున్నారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 తమిళులకు వ్యతిరేఖంగా ఉందని రచ్చ నడుస్తుంది. అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా. LTTEపై చూపించిన కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. నిజానికి ఇందులో చూపినట్టు బయట ఉందడని వాళ్లు ఆరోపిస్తున్నారు. తెలిసీ తెలియకుండా దర్శకులు చేసిన ప్రయత్నం అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ఫోన్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోని తీసేస్తున్నామని.. వెంటనే దీన్ని బాయ్ కాట్ చేయాలంటూ గోల చేస్తున్నారు. తెలుగువాళ్ళు అయిన రాజ్ డికే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో మనోజ్ బాజ్ పెయి ప్రధాన పాత్రలో నటించారు. మరి ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
రవితేజ అవుట్..వరుణ్ తేజ్ ఇన్..!
చిన్నారులకు ఆహారం అందజేసిన సన్నీలియోన్..వీడియో
ముగ్గురు స్టార్ హీరోలతో నటించాలని ఉందట..!
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Recommended Content by ntnews.comSkip Adమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన వీసీలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

