Clap Movie Teaser | జీవితమే ఓ ఆట

‘బహుముఖప్రజ్ఞాశాలిగా ఆది పినిశెట్టి చిత్రసీమలో రాణిస్తున్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో క్రీడా నేపథ్య కథాంశాలతో తెరకెక్కిన చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఆలరించాయి. ఆ జాబితాలో ఈ సినిమా నిలవాలి’ అని అన్నారు అగ్రకథానాయకుడు చిరంజీవి. ‘క్లాప్’ చిత్ర టీజర్‌ను సోమవారం ఆయన విడుదలచేశారు. ఆది పినిశెట్టి, ఆకాంక్షసింగ్ జంటగా నటించారు. పృథ్వీ ఆదిత్య దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘చాలెంజింగ్ పాత్రలో ఆదిపినిశెట్టి కనిపిస్తున్నాడు. అతడి పాత్రగమనంలో వచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉంది. కొత్త ఆలోచనలతో తెరకెక్కిన ఈ చిత్రం విజయాన్ని సాధించాలి. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అనితెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘విష్ణు అనే అథ్లెట్ కథ ఇది. పరుగుపందెంలో జాతీయస్థాయిలో విజేతగా నిలవాలనే అతడి కలకు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?జీవితమనే ఆటలో ఆ క్రీడాకారుడు గెలిచాడా?ఓడిపోయాడా? అన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆకాంక్షసింగ్ హాకీప్లేయర్‌గా కనిపిస్తుంది. షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, నాజర్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, మాటలు: వనమాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

