Circus Movie First Single | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘రామ్‌లీల’, ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావతి’ వంటి సినిమాలతో తెలుగులోనూ ఈయన మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘గల్లిబాయ్’ తర్వాత రణ్వీర్ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ’83’, ‘జయేష్‌భాయ్ జోర్దార్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలు సాధించాయి. దాంతో ప్రస్తుతం రణ్వీర్ ఆశలన్ని ‘సర్కస్’ చిత్రంపైనే ఉన్నాయి. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
‘సున్ జరా’ అంటూ సాగే మెలోడియిస్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటలోని కాస్ట్యూమ్స్, కార్లు.. ప్రతీది మనల్ని 60’s టైమ్‌లైన్‌లోకి తీసుకెళ్లాయి. ఈ పాటకు రాకింగ్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్ స్వరపరిచాడు. ఈ పాటను శ్రేయా ఘోషల్, పాపన్ ఆలపించారు. త్వరలోనే ఈ పాట తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్వీర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. టీ సరిస్ ఫిలింస్, రిలయన్స్ ఎంటర్టైనమెంట్స్తో కలిసి రోహిత్ శెట్టి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. రణ్‌వీర్‌కు జోడీగా పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు నటిస్తున్నారు.