Mahesh Babu | అప్పుడెప్పుడో ఏడాదినర్ధం క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న గుంటూరు కారం ఇప్పటికీ సగం షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకోలేదు. ఆది నుంచి ఈ సినిమాకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. రెండు షెడ్యూల్స్ తర్వాత ఏకంగా కథనే మార్చారంటే ఇదెక్కడి విడ్డూరం అనిపించింది. ఆ తర్వాత మహేష్‌బాబు ఫ్యామిలీలో విషాదాలు, వెకేషన్లు ఇలా చూస్తుండగానే నెలలు నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకు ఈ ఏడాది కలిసొచ్చి నిర్విరామంగా షూటింగ్ జరుతుందనగా మళ్లీ థమన్ తప్పుకున్నాడు, పూజా తప్పుకుందని వార్తలతో మరోసారి గుంటూరు కారం హాట్ టాపిక్ అయిపోయింది.
ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదా అనే డౌట్.. అంతలో ఇలా ఒక్కొక్కరు తప్పుకుంటే ఇక సంక్రాంతి సంగతి దేవుడికే తెలియాలి అనే విధంగా అయిపోయింది. అయితే ఇటీవలే థమన్ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు నాగవంశీ క్లారటీ ఇచ్చేశాడు. కానీ పూజా విషయంలో మాత్రం క్లారిటీ లేదు. పూజా కూడా క్రియేటీవ్ డిఫెరెన్సెస్ రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఆమె సన్నిహితులు చెప్పారు. ఇక ఇప్పుడు ఆమె ప్లేస్‌ను శ్రీలీల ఆక్యూపై చేసింది. సెకండ్ హీరోయిన్గా ప్రాజెక్ట్‌లోకి వచ్చిన శ్రీలీల కాస్త మెయిన్ లీడ్‌గా ఫిక్సయిపోయింది. ఇక శ్రీలీల పాత్ర కాస్త మీనాక్షి చౌదరి చేస్తుంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ పీ.ఎస్ వినోద్ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి రవి చంద్రన్ వచ్చి చేరాడని ఇన్సైడ్ టాక్. ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా నుంచి తప్పుకుంటండటంతో మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ సినిమా పూర్తవుతుందా అనే డౌట్‌తో ఉన్నారు. మరో వైపు ఎట్టిపరిస్థుల్లో సంక్రాంతికే సినిమాను దింపాలని చిత్రయూనిట్ కసరత్తులు చేస్తుందట. ఓ వైపు ఇలా స్టార్ కాస్ట్, టెక్నీషియన్స్ తప్పుకుంటూ పోతే.. మరోవైపు షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తున్నారంటూ ట్విట్టర్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. మరీ ఈ తప్పుకోవడాలు ఇక నుంచైనా తగ్గుతాయో లేదో చూడాలి.