Raag Mayur | సినిమా బండి, కీడాకోలా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నటుడు రాగ్ మయూర్ తాజాగా బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మెరిశాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 శుక్రవారం నుంచి ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ఒక ప్రోమో క్లిప్‌ను పంచుకుంది చిత్రబృందం. ఇందులో సినిమాబండి సినిమాలో మరిదేశ్ బాబు పాత్రలో అలరించిన నటుడు రాగ్ మయూర్ అతిథి పాత్రలో కనిపించాడు. రైల్వే టికెట్ కలెక్టర్ పాత్రలో కనిపించిన రాగ్ మయూర్ మనోజ్‌తో మాట్లాడిన సన్నివేశం ఆకట్టుకుంది. రాగ్ మయూర్‌తో పాటు, మరో తెలుగు నటుడు రవివర్మ కూడా ఈ సీజన్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే తెలుగు దర్శకులు కావడంతో రాగ్ మయూర్‌ని అతిథి పాత్రలో నటించమని అడిగినట్లు తెలుస్తుంది.
lie so convincing that we almost believed them 👀#TheFamilyManOnPrime, New Season, Watch Now pic.twitter.com/Rrz9fHjVuk
— prime video IN (@PrimeVideoIN) November 21, 2025