హుషారెత్తించే గీతం
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర-1’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ‘చుట్టమల్లె..’ అనే పాటకు యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వీక్షణలు దక్కాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి.
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర-1’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ‘చుట్టమల్లె..’ అనే పాటకు యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వీక్షణలు దక్కాయి. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘దావుడి’ అనే మూడో పాటను బుధవారం విడుదల చేశారు. ఫాస్ట్‌బీట్‌తో సాగిన ఈ పాటలో నాయకానాయికలు ఎన్టీఆర్, జాన్వీకపూర్ల నృత్యాలు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని నకష్ అజీజ్, ఆకాశ ఆలపించారు. ప్రేక్షకుల్ని హుషారెత్తించే గీతమిదని, థియేటర్లో అభిమానులతో డ్యాన్స్‌లు చేయిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. సైఫ్అలీఖాన్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

