Jr NTR | తారక్ అసాధారణ ప్రతిభాశాలి
తారక్ ‘దేవర’ చిత్రానికి పనిచేస్తుండటంపై బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్ ఆనందం వెలిబుచ్చారు. ఎన్టీఆర్‌తో పనిచేయడం పట్ల ఎగ్జయిట్ అవుతూ తన ఇన్‌స్టాలో తారక్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు బాస్కో మార్టిన్.
తారక్ ‘దేవర’ చిత్రానికి పనిచేస్తుండటంపై బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్ ఆనందం వెలిబుచ్చారు. ఎన్టీఆర్‌తో పనిచేయడం పట్ల ఎగ్జయిట్ అవుతూ తన ఇన్‌స్టాలో తారక్‌తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు బాస్కో మార్టిన్. బాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా బాస్కో మార్టిన్‌ది ప్రత్యేకస్థానం. పఠాన్, వార్, ఫైటర్ చిత్రాల్లో ఆయన కంపోజ్ చేసిన అద్భుతమైన నృత్యరీతులు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఆయన ‘దేవర’ సినిమాకు పనిచేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాలోని ఓ పాటకు బాస్కో మార్టిన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ఈ పాట చిత్రీకరణ కోసం టీమ్ థాయిలాండ్ వెళ్లింది. అక్కడ తారక్‌తో దిగిన ఫొటోలనే ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. తారక్ అసాధారణ ప్రతిభాశాలి అని, అతనితో పనిచేయడం గొప్ప అదృష్టమని బాస్కో మార్టిన్ అన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా రూపొందుతోంది. సెప్టెంబర్ 27న తొలిభాగం విడుదల చేస్తారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

