Prabhu Deva | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ (Choreographer), దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ప్రభుదేవాకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శేష వస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఆలయం వెలుపల ప్రభు దేవాను చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
#WATCH | Andhra Pradesh | Choreographer & Film Director Prabhu Deva visited Tirupati Tirumala temple earlier today pic.twitter.com/SWIHPC3X58
— ANI (@ANI) March 19, 2025
Also Read..
Srisailam Temple | శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు.. ఏర్పాట్లను పరిశీలించిన ఈవో
TTD | తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఈ రెండురోజుల్లో వీఐపీ దర్శనాలకు బ్రేక్..!
Posani Krishna Murali | గుంటూరు జైలుకు నటుడు పోసాని కృష్ణమురళి..!