Chiyaan Vikram | ఇటీవలే భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఇందులో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ అభిమానులను ఖుషీ చేసే కొత్త న్యూస్ బయటకు వచ్చింది.
కొన్ని రోజులుగా పొన్నియన్ సెల్వన్ 2 ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న విక్రమ్ మళ్లీ షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. తాజా అప్డేట్ ప్రకారం తంగలాన్ షూటింగ్ ఇవాళ చెన్నైలో ప్రారంభమైంది. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. మిగిలిన పార్టును మరో రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేయనుంది పా రంజిత్ టీం. ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే విడుదల చేసిన తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కాబోతుంది.
ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
విక్రమ్ మరోవైపు గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram) మూవీ కూడా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..