Chiyaan Vikram | మోడ్రన్, స్టైలిష్ లుక్‌లో చియాన్ విక్రమ్.. నయా అవతార్ సీక్రెట్ ఏంటో..?
Chiyaan Vikram | ఆరు పదుల వయస్సు దగ్గరకొస్తున్నా ఆ ఛాయలేమీ కనిపించకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తుంటాడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు విక్రమ్.
Chiyaan Vikram | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేసే అతికొద్ది మంది యాక్టర్లలో ఒకడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఆరు పదుల వయస్సు దగ్గరకొస్తున్నా ఆ ఛాయలేమీ కనిపించకుండా ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ.. ఎప్పటికపుడు కొత్త కొత్త లుక్‌లో దర్శనమిస్తుంటాడు. తంగలాన్ (Thangalaan) చిత్రంలో డీగ్లామరైజ్డ్ లుక్‌లోకి మేకోవర్ మార్చుకుని అందరినీ షాక్‌కు గురిచేసిన విక్రమ్.. తాజాగా ఎవరూ ఊహించని ట్రాన్స్‌ఫార్మేషన్‌లోకి మారిపోయాడు.
అపరిచితుడులో రెమోలా లాంగ్ హెయిర్‌లో కనిపించిన విక్రమ్.. ఈ సారి గజినీ సినిమాలో సూర్యను గుర్తుకు తెచ్చే లుక్‌లో కనిపిస్తున్నాడు. పొట్టిహెయిర్లో బ్లాక్ గ్లాగుల్స్ పెట్టుకుని versace jeans couture బ్రాండ్ కాస్ట్యూమ్‌లో స్టైలిష్‌గా మెస్మరైజ్ చేస్తూ.. ఔరా అనిపిస్తున్నాడు విక్రమ్. ఇంతకీ తాజా లుక్ ఏదైనా ఫొటోషూట్‌కు సంబంధించిందా..? లేదా కొత్త సినిమా లుక్ అనేది తెలియాల్సి ఉంది.
విక్రమ్ ఈ ఏడాది భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2లో ఆదిత్య కరికాలన్ పాత్రలో అదిరిపోయే యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం విక్రమ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2024 ప్రథమార్థంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తంగలాన్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
తంగలాన్ లో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ మూవీని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2డీ, 3డీ ఫార్మాట్లలో కూడా విడుదల కాబోతుంది.
విక్రమ్ మరోవైపు గౌతమ్ వాసు దేవ్ మీనన్ (Gautham Menon) డైరెక్షన్లో ధ్రువ నక్షత్రం.. చాప్టర్ వన్: యుద్ద కాండం (Dhruva Natchathiram)లో కూడా నటిస్తున్నాడు. స్పై థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో ఐశ్వర్యారాజేశ్, సిమ్రాన్, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#ChiyaanVikram looks super stylish 👌🔥 @chiyaan . Amazing how he changes his look very often yet pulling it off elegantly @proyuvraaj pic.twitter.com/AfllzJ8pBV
— Rajasekar (@sekartweets) August 18, 2023
@chiyaan looks Ultimate Swagg💥🔥💥🔥🥵🥵 in his new look #ChiyaanVikram #Thangalaan #Dhruvanatchathiram pic.twitter.com/gP0tejCOy9
— Eswar (@eswarcvf) August 18, 2023
#ChiyaanVikram @chiyaan has taken his charisma to a whole new level with his mesmerizing new look! 😍@proyuvraaj pic.twitter.com/GErTYuqd85
— Haricharan Pudipeddi (@pudiharicharan) August 18, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
#DhruvaNatchathiram post production works almost done…
Team planning to release the film in July (tentative date July 14)New Trailer Coming Soon pic.twitter.com/pZql4BGlWd
— Karthik Ravivarma (@Karthikravivarm) May 25, 2023
రన్ వేపై విక్రమ్ టీం..
Wishing @chiyaan a very Happy Birthday!#DhruvaNatchathiram @Jharrisjayaraj @OndragaEnt @oruoorileoru @manojdft @srkathiir @the_kochikaran @editoranthony @riturv @realradikaa @SimranbaggaOffc @rparthiepan @DhivyaDharshini @rajeevan69 @Kumar_gangappan @Kavithamarai @utharamenon5 pic.twitter.com/TmfW15RxCe
— Gauthamvasudevmenon (@menongautham) April 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

