యుజుర్వేద్, రచన జంటగా నటుడు సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘చిత్తం మహారాణి’. ఏ.కాశీ దర్శకుడు. జేఎస్ మణికంఠ, ప్రసాద్ రెడ్డి టీఆర్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్రంలోని ‘కోలకళ్ల చిన్నది’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. రామ్ మిర్యాల ఈ గీతాన్ని ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక విభిన్నమైన లవ్ఎంటర్టైనర్. ప్రతి పాత్ర ఎంతో సహజంగా వుంటుంది. ఇటీవల విడుదలైన పాటకు చక్కని స్పందన వస్తోంది’ అన్నారు. తులసి, హర్షవర్ధన్, మధునందన్, సత్య, రాజ్‌కుమార్, కాశిరెడ్డి, వైవా హర్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గౌర హరి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, మాటలు: సురేష్ సిద్హాని.