Battle Of Galwan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ చిత్రాంగద సింగ్ కథానాయికగా నటించబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నాడు. సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇది. భారతదేశం-చైనా సరిహద్దులో 2020లో జరిగిన గల్వాన్ లోయ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు అపూర్వ లఖియా వెల్లడించాడు.
#ChitrangadaSingh Is Officially ON BOARD For Playing Female Lead Opposite #SalmanKhan in #BattleOfGalwan 💥🔥✅ pic.twitter.com/TC6Iv8ajAn
— OTT STREAM UPDATES (@newottupdates) July 9, 2025