Chithha Movie | కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddarth), నిమిషా విజయన్ జంటగా నటించిన చిత్రం చిత్తా (Chithha). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సేతుపతి (Sethupathy) సినిమా ఫేమ్ అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతుంది.
ఫ్యామిలీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక చిత్తాపై ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందా అని స్వయంగా చూడటం కోసం సిద్ధార్థ్‌తో పాటు చిత్ర యూనిట్ చెన్నైలోని కొన్ని థియేటర్స్‌ను విజిట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మేకర్స్ పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోలలో సిద్ధార్థ్‌తో హైదరాబాద్ బ్యూటీ ఆదితీరావ్ హైదరీ సందడి చేసింది. సిద్ధార్థ్‌తో పాటు థియేటర్‌కు వెళ్లిన ఆదితీరావ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు మరోసారి జంటగా కనిపించడంతో ఈ డేటింగ్ రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ ఎటువంటి ప్రకటన ఇవ్వలేదు.
Siddharth & Aditi Rao Hydari spotted at Rakki Cinemas, Ambatur.#Chithha pic.twitter.com/827WF3ua8u
— Christopher Kanagaraj (@Chrissuccess) October 1, 2023
EXTRAORDINARY response for #Chithha in theatres, here are the visuals from the theatre visits with #Siddharth and director #SUArunKumar ❤️
Terrific pickup for the film with houseful shows all over TN 🔥pic.twitter.com/fg1tIiDqky
— Ramesh Bala (@rameshlaus) October 1, 2023
ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సంబంధించిన టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ మూవీని తెలుగులో అక్టోబర్ 06న విడుదల చేయనున్నారు.