పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ వచ్చారు. గత ఏడాదే ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం విడుదలైన వకీల్ సాబ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ప్రభంజనం సృష్టిస్తుంది.
వకీల్ సాబ్ చిత్రాన్నిఅమ్మతో కలిసి థియేటర్లో వీక్షిస్తానని చిరంజీవి ఇటీవల ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆయన నిన్న సాయంత్రం తన తల్లి, కుటుంబ సభ్యులతో కలిసి ఏఎంబీ మాల్లో వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. చిత్రం చాలా బాగుందని ప్రశంసించారు. పవన్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్పై నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. వకీల్ సాబ్ చిత్రం హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే. తెలుగులో శ్రీరామ్ వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అమ్మ తో పాటు అందరం వకీల్ సాబ్ థియేటర్ లో.. Showtime #VakeelSaab pic.twitter.com/FCVeJG3nLQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 9, 2021
Mega family watched @PawanKalyan's blockbuster movie #VakeelSaab at @amb_cinemas.@KChiruTweets @NagaBabuOffl @IamSaiDharamTej @IAmVarunTej #VakeelsaabJusticeserved pic.twitter.com/lVugKxHy6P
— BA Raju's Team (@baraju_SuperHit) April 9, 2021