Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
Chiru-Kamal | మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ వేదికపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఓ సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే ప్రచారం సాగుతోంది
Chiru-Kamal | మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై తనదైన నటనతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ వేదికపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఓ సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమానికి ‘మెగావర్స్’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘మెగావర్స్’ పేరుతో రూపొందనున్న ఈ టాక్ షోను 12 నుంచి 15 ఎపిసోడ్లుగా తీసుకురావాలని ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్యలతో చిరంజీవి ఓ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎపిసోడ్లో హాస్యంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను ముందుగా చిత్రీకరించినప్పటికీ, ఓటీటీలో మొదటి ఎపిసోడ్‌గా విడుదల చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు ‘మెగావర్స్’ గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఈ టాక్ షోలో అతిథిగా పాల్గొననున్నారనే ప్రచారం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. చిరంజీవి, కమల్ హాసన్ కలిసి ఓ ప్రత్యేక ఎపిసోడ్లో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, కమల్ హాసన్ రీసెంట్గా హైదరాబాద్‌కు రావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. ఆయన ‘మెగావర్స్’ షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చారా? లేక ‘కల్కి 2’ చిత్రీకరణ కోసం వచ్చారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి, కమల్ హాసన్ గతంలో కలిసి నటించారు. 1979లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇది కథ కాదు’ చిత్రంలో ఇద్దరూ తెరను పంచుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమాలో నటించలేదు. అయితే కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్‌తో కలిసి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో కనిపించారు. ఇప్పుడు చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరించనున్న టాక్ షోలో కమల్ హాసన్ నిజంగానే పాల్గొంటే, దశాబ్దాల అనుబంధం ఉన్న ఇద్దరు దిగ్గజ నటులను ఒకే వేదికపై చూసే అవకాశం అభిమానులకు లభిస్తుంది. వారి సినీ ప్రయాణం, అనుభవాలు, పరిశ్రమలో ఎదురైన ఆసక్తికరమైన సంఘటనల గురించి సంభాషణ సాగితే ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
South Carolina | అణు పరిశోధనా కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు..!
Story competition | కథల పోటీలో ప్రతిభ చాటిన పావని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

