Chiru-Bobby | మెగాస్టార్ చిరంజీవి వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘విశ్వంభర’ షూటింగ్ దాదాపు పూర్తిచేసిన ఆయన, ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. ఈ సినిమా పూర్టైన వెంటనే మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం దర్శకుడు బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం #Mega158గా ప్రచారం జరుపుకుంటున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది. ఈ సినిమా కాస్టింగ్, టెక్నీషియన్ల ఎంపికలపై గత కొద్ది రోజులుగా ఫిలింసర్కిల్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
‘మెగా 158’ సినిమాకి మాలీవుడ్ టాప్ డీఓపీ నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారని సమాచారం. ‘లుకా’, ‘రోర్షాక్’, ‘కురుప్’, ‘కింగ్ ఆఫ్ కొట్టా’ వంటి మలయాళ చిత్రాలతో అద్భుతమైన విజువల్స్ అందించిన నిమిష్, టాలీవుడ్లో ‘లక్కీ భాస్కర్’ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల భారీ విజయం సాధించిన ‘లోకా చాప్టర్ 1’ చిత్రానికి కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో రూపొందుతున్న #Suriya46 చిత్రంపై పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రతిభావంతుడైన టెక్నీషియన్ చిరంజీవి – బాబీ ప్రాజెక్ట్‌తో జాయిన్ అవుతుండటంతో సినిమా హైప్ మరింత పెరిగింది.
‘మెగా 158’లో ఇద్దరు హీరోలు కనిపించనున్నారని, అందులో ఒకరుగా తమిళ హీరో కార్తీ ఉండబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించే అవకాశం ఉందని టాక్. హీరోయిన్గా మాళవిక మోహనన్ పేరు వినిపించినా, ఆమె దీనిని ఖండించింది. సంగీత దర్శకుడిగా మొదట ఎస్. థమన్ పేరు వచ్చినా, తరువాత దేవిశ్రీ ప్రసాద్ కూడా రేసులో ఉన్నారని ప్రచారం. వీరిలో ఎవరు ఫైనల్ అవుతారో త్వరలో తెలుస్తుంది. చిరంజీవి – బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి భారీ హిట్‌గా నిలిచింది. రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఆ సినిమా తర్వాత, వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ ముగిసిన వెంటనే ‘ChiruBobby2’ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.