chiranjeevi-venkykudumula movie | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. వరుసగా సినిమాలను ఒకే చేస్తూ యువ హీరోలకు సవాల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాలశివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఇక గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. బాబీ దర్శకత్వంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే వెంకీ కుడుముల తెరకెక్కించే సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇటీవలే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ కాంబోపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రాన్ని ఇంద్ర తరహాలో వెంకీ స్క్రీప్ట్‌ను రెడి చేస్తున్నాడని సమాచారం. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కు వెంకీ కుడుముల తన శైలి కామెడీని యాడ్ చేసి మాస్ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నాడట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహన్ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం. వెంకీ కుడుముల గత చిత్రాలు ఛలో, భీష్మ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టాయి.