Bhola shankar Movie | మరో మూడు వారాల్లో భోళా మేనియా షురు కానుంది. వాల్తేరు వంటి బంపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ వీర లెవల్లో అంచనాలు నెలకొన్నాయి. దానికి తగట్లే టీజర్, పాటలు గట్రా సినిమాపై మంచి హైప్ తెచ్చిపెట్టాయి. మెహర్ రమేష్ దర్శకత్వంపై కొంత మందికి డౌట్‌గానే ఉన్నా.. బిల్లా రేంజ్ బొమ్మ పడినా చాలు సినిమా కోట్లు కొల్లగొట్టడం ఖాయమని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించనుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లను ప్రకటిస్తూ సినీ అభిమానుల్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కాగా తాజాగా చిరు భోళా శంకర్ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను లీక్ చేశాడు. ఇన్ని రోజులు పవన్ కల్యాణ్ తన సినిమాల్లో నా సాంగ్స్‌కు స్టెప్పులేయడం, నా డైలాగ్స్‌ను ఇమిటేట్ చేయడం వంటివి చేసి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేశాడు. ఇక ఇప్పుడు నేను కూడా అందరినీ అలరించడానికి భోళా శంకర్‌లో పవన్ మేనరిజమ్‌లను ఇమిటేట్ చేయబోతున్నాను అని ఓ వీడియోను లీక్ చేశాడు.
ఖుషి సినిమాలోని యే మేరా జహా పాటను చిరు ఇమిటేట్ చేసిన వీడియోను లీక్ చేశాడు. ఇది కేవలం ఒక సీన్ మాత్రమే.. సినిమాలో ఇంకా చాలా ఉందని చిరు ఆ వీడియోలో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా తమన్నా నటించింది. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సుశాంత్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
#ChiruLeaks #BholaaShankar #BholaaShankarAsPK#BholaaShankarOnAug11 pic.twitter.com/E7FmyeFulw
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2023