Bhola Shankar Trailer | అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను గరువారం హీరో రామ్చరణ్ విడుదల చేశారు. కోల్కతా నేపథ్యంలో మొదలైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, వినోదం అంశాల కలబోతగా ఆకట్టుకుంది. అమ్మాయిల మిస్సింగ్ కేసులను ఛేదించడానికి భోళా శంకర్ ఎంట్రీ ఇవ్వడం..
అనంతరం వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ‘నా వెనక పెద్ద మాఫియా ఉంది’ అనే సవాలుకు చిరంజీవి స్పందిస్తూ ‘నా వెనక దునియా ఉంది’ అనే సంభాషణ హైలైట్గా నిలిచింది. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్, స్క్రీప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.