Bhola Shankar Movie | ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన చిరు ప్రస్తుతం అదే జోష్‌తో ‘భోళా శంకర్’ పూర్తి చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా భోళా శంకర్ సెట్లోకి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వెళ్లాడు.
ప్రస్తుతం చిత్రయూనిట్ కోల్కత్తా నేపథ్యంలో సాగే ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. కాగా షూటింగ్ జరుగుతున్న సెట్స్‌కు రాఘవేంద్రరావు వెళ్లాడు. అనంతరం మాట్లాడుతూ ‘నేను చూడాలని వుంది సెట్స్ కు కూడా వెళ్ళాను. అప్పుడు ‘రామ్మా చిలకమ్మా’ సాంగ్ తీస్తున్నారు. అది కూడా కోల్‌కతా నేపథ్యంలో సాగింది. ఇప్పుడు ఈ సాంగ్ షూటింగ్ చూస్తుంటే… ఆ పాట జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆ పాటలా ఈ పాట కూడా చార్ట్ బస్టర్ అవుతుంది. అదే విధంగా సినిమా కూడా బ్లాక్‌బస్టర్ సాధిస్తుందని’ చెప్పాడు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. చిరుకు జోడీగా తమన్నా నటిస్తుంది. ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో పోస్ట్ పోన్ చేశారు.
A magical frame from the sets of #Bholaashankar❤️🔥
Legendary @Ragavendraraoba garu visited the sets and wished the entire team with his blessings🙏🏻
He visited Mega🌟@KChiruTweets's Choodalani undi film Ramma Chilakamma song sets a long back and It was a Blockbuster & now IYKYK😉 pic.twitter.com/9gwgqa5L2v
— BholāShankar (@BholaaShankar) February 11, 2023