Chiranjeevi | యూకే పార్లమెంట్లో చిరంజీవికి సత్కారం.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి.. ఇది ఒక పేరు కాదు బ్రాండ్. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక పేజ్ లిఖించుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చిరంజీవి ఎన్నో అవార్డులని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి.. ఇది ఒక పేరు కాదు బ్రాండ్. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక పేజ్ లిఖించుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీని రూల్ చేస్తున్న చిరంజీవి ఎన్నో అవార్డులని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో వేడుక జరిగింది. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ తదితరులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు. చిరంజీవిని హౌజ్ ఆఫ్ కామన్స్- యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించగా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో ఇలా సత్కరిస్తూ ఉంటారు. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా చిరంజీవికి అందజేసింది. అందజేస్తోంది. ఇది చిరంజీవి కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది.
ఇక ఇటీవలి కాలంలో చిరంజీవి వరసగా అవార్డులు, గౌరవాలు అందుకుంటూనే ఉన్నారు. గతేడాది దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మ విభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే డాన్సుల్లో ఆయన సాధించిన ఘనతని గుర్తించి గిన్నీస్ బుక్‌లో చోటిచ్చారు. డాన్సుల్లో గిన్నీస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో.. 537 పాటల్లో.. 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి. ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో భాగంగా చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన విషయం తెలిసిందే.
#Chiranjeevi – EMPEROR🫡
Proudest moment for the #Telugu speaking bastion! 🌟🌟🌟
Last night, #MegaStarChiranjeevi became the 1st Indian Celebrity to receive the prestigious “Lifetime Achievement Award” from the British Government at the #UK parliament here in #London !… pic.twitter.com/Pnsp2ewsUa
— FILMOVIEW (@FILMOVIEW_) March 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే రైతాంగానికి తీరని నష్టం : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

