Vishwambhara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) కాంపౌండ్ నుంచి వస్తోన్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఇటీవలే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రమ రామను విడుదల చేశారని తెలిసిందే. ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. శంకర్ మహదేవన్, ఐరా ఉడుపి, లిప్సికా భాష్యం పాడారు. రమ రామ సాంగ్ విశ్వంభరకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తాజా వార్త చెప్పకనే చెబుతోంది.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనుండగా.. మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Here is the lyric sheet of the beautiful song in the praise of Lord Rama 🏹
Soulfully penned by ‘Saraswatiputra’ @ramjowrites ✨#Vishwambhara First Single #RamaRaama TRENDING #1 on YouTube ❤🔥
▶️ https://t.co/fLCfiew3XTMusic by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by… pic.twitter.com/Ptod9dyUyS— BA Raju’s Team (@baraju_SuperHit) April 15, 2025
రమ రామ సాంగ్..