Bhola Shankar | టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మెహర్‌రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna Bhatia) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే భోళా మేనియా, జామ్ జామ్ జజ్జనక పాటలు లాంఛ్ చేయగా.. తాజాగా మిల్కీ బ్యూటి సాంగ్ ప్రోమో (Milky Beauty Song Promo) ను లాంఛ్ చేశారు.
మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అంటూ సాగుతున్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. మహతిస్వరసాగర్, విజయ్ ప్రకాశ్, సంజన కల్మంజే పాడారు. తమన్నా, చిరుపై వచ్చే ఈ పాటను స్విట్జర్లాండ్‌లో షూట్ చేసినట్టు ఇప్పటికే అప్డేట్ ఇచ్చేశాడు చిరంజీవి. ఈ సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. చిరంజీవి సోదరి పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది.
భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
భోళా శంకర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఆగస్టు 11న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఇటీవలే లాంఛ్ చేసిన భోళామేనియా,జామ్ జామ్ జజ్జనక సాంగ్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. భోళాశంకర్ కోసం చిరంజీవితోపాటు సుశాంత్ ఇతర నటీనటులు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశారు. కోల్‌కతాలోని అందమైన లొకేషన్లలో భోళా శంకర్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
మిల్కీ బ్యూటీ ప్రోమో..
The mighty monsoons call for a Mega Melody❤️#Bholaashankar third single #MilkyBeauty 🤍
Song Promo is out now 🎶Full Lyrical Tomorrow @ 4:05 PM❤️🔥@SagarMahati thumping musical 🥁
Mega🌟 @KChiruTweets
A film by @MeherRamesh @AnilSunkara1… pic.twitter.com/ukV265prmB— AK Entertainments (@AKentsOfficial) July 20, 2023