Miss Shetty Mr Polishetty | టాలీవుడ్ నుంచి రాబోతున్న ఎంటర్టైనర్ Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 7 సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది నవీన్ పొలిశెట్టి టీం. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు ముందే సినిమా ఎలా ఉందో తెలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడలాంటి అప్డేట్నే అందించాడు మెగాస్టార్ చిరంజీవి.
Miss శెట్టి మిస్టర్ Polishetty చిత్రాన్ని చిరంజీవి వీక్షించాడు. అనంతరం టీంను అభినందిస్తూ.. సినిమాపై రివ్యూ ఇచ్చాడు. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనుష్కశెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవటంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్‌బాబుని అభినందించాల్సిందే. అంతేకాదు ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడ్ని నేనే.. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు.. అంటూ రాసుకొచ్చాడు చిరు.
మహేశ్ బాబు పీ డైరెక్ట్ చేస్తున్న Miss శెట్టి మిస్టర్ Polishetty తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ లవ్ ట్రాక్‌తో సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే లాంఛ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలతో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్. సింగిల్స్ గా ఉన్న నవీన్ పొలిశెట్టి, అనుష్క మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023
నవీన్ పొలిశెట్టి చిట్ చాట్..
ప్రెస్ మీట్ ఫొటోలు..
Clicks 📸📸 From Grand Press Meet.🤩#MissShettyMrPoliShetty
▶️https://t.co/SRx7ASNDmk#MSMPonSep7th@MsAnushkaShetty @NaveenPolishety @adityamusic @uv_creations @filmymahesh @shreyasgroup pic.twitter.com/GbHCruiRhG
— BA Raju’s Team (@baraju_SuperHit) September 4, 2023
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..
Miss శెట్టి మిస్టర్ Polishetty ట్రైలర్..
లేడీ లక్ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
లేడీ లక్ ప్రోమో..
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..