shivani | రాజశేఖర్ కూతురు సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

chiranjeevi praises shivani rajsekhar debut movie | కొన్ని చిన్న సినిమాలు విడుదలైనప్పుడు స్టార్ హీరోలు వాటిని చూసి ప్రశంసిస్తే.. అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. దానికి మించిన ప్రమోషన్ ఆ సినిమాకు మరొకటి ఉండదు. ఇప్పుడు చిరంజీవి ఇదే చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలకు ఈయన అండగా నిలుస్తున్నాడు. తనకు తోచినంత వరకు వాటికి సాయం చేస్తున్నాడు చిరంజీవి. కొన్ని సినిమాలు చూసి వాటి మీద సోషల్ మీడియాలో తన అభిప్రాయం పోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేశాడు చిరు. తేజ సజ్జ హీరోగా నటించిన అద్భుతం సినిమా ఈ మధ్యే హాట్ స్టార్ డిస్నీలో విడుదలైంది.
We are extremely happy for the kind gesture of Mega Star @KChiruTweets encouraging our movie 💥😍
— Mahaateja Creations (@MahatejaC) November 23, 2021
Watch on #DisneyPlusHotstarMultiplex
▶️https://t.co/SFCmVouAsL
@DisneyPlusHS #AdbhutamOnHotstar@tejasajja123 @Rshivani_1 @MahatejaC @SOriginals1 @MallikRam99 @PrasanthVarma pic.twitter.com/DMnRlIHuzP
దీనికి మంచి టాక్ వచ్చింది. నావెల్ కాన్సెప్ట్ తీసుకున్నారు.. కాకపోతే తీసిన విధానం మాత్రం అంతగా ఆకట్టుకోలేదు అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఓవరాల్‌గా సినిమా మాత్రం బాగానే ఉంది.. ఒకసారి చూడొచ్చు అనే అభిప్రాయం అందరి నుంచి వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమా చూసి అద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకున్నాడు. సినిమా యూనిట్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. దర్శకుడు మల్లిక్ రామ్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తాడు అంటూ తెలిపాడు. ఇక జూనియర్ ఇంద్ర తేజ సజ్జ నటన సూపర్ అంటూ మెచ్చుకున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో హీరోయిన్గా రాజశేఖర్ కూతురు శివాని నటించింది. ఈమె నటించిన తొలి తెలుగు సినిమా ఇదే. శివాని నటన గురించి చెబుతూ తెరపై ఎంతో అందంగా ఉండటమే కాదు.. అద్భుతంగా నటించింది అంటూ శివానిని మెచ్చుకున్నాడు మెగాస్టార్. నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉందమ్మా అంటూ శివానిని నిండు మనసుతో ఆశీర్వదించాడు చిరంజీవి. ఇండస్ట్రీలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. అవేమీ పట్టించుకోకుండా రాజశేఖర్ కూతురు గురించి అద్భుతమైన మాటలు చెప్పాడు మెగాస్టార్. ఈయన ట్వీట్ చూసిన తర్వాత తేజ సజ్జ, శివాని రాజశేఖర్ కూడా గాల్లో తేలిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెద్దయ్యాక హీరో అవుతా.. చిరంజీవి నా పెళ్ళికి వస్తాడు.. చిన్నప్పటి కలలు నెరవేరాయంటున్న యంగ్ హీరో
ఏపీలో టికెట్స్ ధరల ఎఫెక్ట్.. భీమ్లా నాయక్ సినిమాకు తప్పని కష్టాలు..
కన్నీరు పెట్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. భార్యతో గొడవలే ఆత్మహత్యకు కారణమా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

