ఏపీలో టికెట్స్ ధరల ఎఫెక్ట్.. భీమ్లా నాయక్ సినిమాకు తప్పని కష్టాలు..

Bheemla nayak | ఏపీలో సినిమా ఇండస్ట్రీకి పరిస్థితులు ఇంకా కలిసి రావడం లేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు నిర్మాతలను కష్టాల్లోకి నెట్టేశాయి. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల కారణంగా కరోనా వైరస్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీ ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. అయితే సామాన్యులకు సినిమా చూడటం భారంగా మారకూడదు అనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను తగ్గించింది. కానీ ఇది ఇలాగే కొనసాగితే తమకు భారీ నష్టాలు తప్పవని సినీ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతించాలని జగన్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కొందరు తెలుగు సినిమా నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు చర్చలు సఫలం కాలేదు.
ఇదిలా ఉంటే సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమా టికెట్ల ధరలను పెంచే విధంగా ప్రభుత్వంతో చర్చించటానికి కొందరు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. కానీ భీమ్లా నాయక్ విషయంలో మాత్రం ఇది కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని.. టికెట్ రేట్లను పరిగణనలోకి తీసుకొని బిజినెస్ అనుకున్న దాని కంటే కాస్త తక్కువ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.85 కోట్ల రేంజ్‌లోనే జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ల ధరల కారణంగా రూ.15 కోట్లు తక్కువకే బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ సినిమా విడుదల సమయానికి జగన్ ప్రభుత్వం మనసు మార్చుకుని టికెట్ రేట్లు పెంచితే డిస్ట్రిబ్యూటర్లకు అంతకంటే పండగ చేసుకునే విషయం మరొకటి లేదు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు రాస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్ నటిస్తోంది. రానా మరో హీరోగా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి విజయం సాధించాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో భేటి కానున్న రాజమౌళి.. కారణం ఏంటో..!
సంక్రాంతికి 1000 కోట్ల బిజినెస్.. ఏ హీరో సత్తా ఎంత..?
CM Jagan Vs PawanKalyan | సీఎం జగన్‌కు పవన్ ఊహించని షాక్.. ఆర్ఆర్ఆర్ ఏమవుతుందో..?
Bheemla nayak | RRR టీంను కంగారు పెడుతున్న పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

