Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడి మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్‌వన్‌గా ఎదిగిన ఆయన కోట్లాది మంది అభిమానులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే చిరు పేరు ప్రతిష్టను కొందరు దుర్వినియోగం చేయాలని చూడగా, ఆయన వారిని పిలిచి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడు. ఒక పత్రిక తమ నష్టాలు తీరేందుకు చిరు ఫోటోతో లిక్కర్ యాడ్ ప్రచారం చేయాలని చూసింది. దీనిపై చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేసి, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరొక పత్రికలో బాబా.. చిరుకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఫోటో ముద్రించగా, అది చూసిన చిరు “నేను ఎవరి ఆశీర్వాదంతో నెంబర్ వన్ కాలేదు” అంటూ ఘాటుగా స్పందించారట.
సాయం అడిగితే వెంటనే స్పదించే చిరంజీవి తన పేరుని దుర్వినియోగం చేస్తే మాత్రం ఏ మాత్రం సహించరు. ఇండస్ట్రీలో చిరంజీవి రారాజుగా వెలుగొందుతున్న సమయంలో ఆయన ఫోటో ముద్రించుకుని చాలా పత్రికలు లాభాలు పొందాలని అనుకునేవి. ఈ క్రమంలో ఒక మ్యాగజైన్ సంస్థ నష్టాలలో ఉండగా, ఆ సమయంలో ఒక లిక్కర్ బ్రాండ్ వారిని గట్టించేలా డీల్ సెట్ చేసుకుందట. అయితే తమ బ్రాండ్ కి ప్రచారం కల్పిస్తే భారీ మొత్తం ఇస్తామని వాళ్ళు ఆఫర్ చేశారు. ఎక్కువ ప్రచారం జరగాలి అంటే చిరంజీవి ఫోటో కవర్ పేజీపై కనిపించాలి. అయితే ఆ సమయంలో కింద లిక్కర్ యాడ్ వేసి, పైన చిరంజీవి ఫోటో ముద్రించారట. ఫైనల్ ఎడిషన్ కంప్లీట్ కాకముందే ఈ విషయం చిరంజీవికి తెలియడంతో పత్రిక వారిని పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారట.
ఏంటిది అని ప్రశ్నించగా, ఆ యాడ్ వేరు.. మీ ఫోటో వేరు అని చెప్పాం. అది నాకు అర్థం అవుతుంది. కానీ సామాన్యులు దానిని ఏరకంగా అనుకుంటారు ? లిక్కర్ బ్రాండ్ పైనే నా ఫోటో ఉంటే.. ప్రమోట్ చేస్తున్నది నేనే అని వాళ్లు ఒప్పుకోరా, దానిని నేను అస్సలు ఒప్పుకోను అని చిరు అన్నారట. అయితే ఆ బ్రాండ్ తో మాకు మంచి డీల్ వచ్చింది సార్ అని చెబితే, ఆయన వెంటనే నా ఫోటో తీసేయండి అని అన్నారు. ఎండీ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా, అప్పుడు వేస్తే లిక్కర్ బ్రాండ్ ఒక్కటే వేసుకోండి.. లేకుంటే నా ఫోటో ఒక్కటే వేయండి అని చిరంజీవి సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన ఫోటోని తొలగించారు అని తోట ప్రసాద్ తెలిపారు. మరో పత్రికలో బాబా.. చిరుని ఆశ్వీరదిస్తున్నట్టు వేశారట. ఇది చిరు దృష్టికి వెళ్లగా.. ఆయన ఆశీర్వాదం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు అని అనుకోవాలా అని గట్టిగా క్లాస్ పీకారట.