Chiranjeevi | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీ ఉన్నాడని తెలిసిందే. సోషియా ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రీకరణ దశలో ఉంది. కాగా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో చిరంజీవి చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన క్రేజీ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేవలం ఒక్క మీటింగ్‌లోనే స్క్రిప్ట్‌కు ఒకే చెప్పేశాడట చిరు. శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ విజన్‌కు ఇంప్రెస్ అయిన చిరంజీవి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకునే చాలా మంది యువ దర్శకుల్లో ఒకడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించబోతున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవిని చాలా ఫ్రెస్ లుక్‌తో నయా అవతార్‌లో చూపించబోతున్నాడట. చిరంజీవి అభిమానులను ఎంగేజ్ చేసేలా సర్ప్రైజింగ్ పాత్రను డిజైన్ చేశాడని ఇన్సైడ్ టాక్. ఇంతకీ ఈ ఇద్దరు ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకొస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
దీనిపై రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. కెరీర్ తొలినాళ్లలోనే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసిన దసరా డైరెక్టర్ మరి అభిమానులను ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Ram Gopal Varma | అప్పటిదాకా నో అరెస్ట్.. రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట
Harish Shankar | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. షోలే డైరెక్టర్‌తో హరీష్ శంకర్