టాలీవుడ్ అగ్ర హీరో చిరంజీవి ప్రస్తుతం చేయబోతున్న సినిమా ‘విశ్వంభర’(వర్కింగ్ టైటిల్). వశిష్ట దర్శకుడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. చిరంజీవి లేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించే పనిలో ఉన్నారు. త్వరలో చిరంజీవి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఇదిలావుంటే.. ఈ సినిమా తర్వాత చేయనున్న సినిమాకు కూడా మెగాస్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం.
బాలయ్యతో ‘భగవంత్ కేసరి’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది చివర్లో మొదలవుతుందని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌కి మెగాస్టార్ 70లోకి అడుగుపెడతారు. ఈ వయసులో కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ రానున్న తరానికి కూడా ప్రేరణగా నిలుస్తున్నారు చిరంజీవి.