Anjana Devi| మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు పెద్ద ఎత్తున వార్తలు రావడం మనం చూశాం. ఈ సమయంలో చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ అమ్మ అంజనాదేవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని , ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో ఉన్న మట వాస్తవమే కాని ఇప్పుడు బాగానే ఉన్నారు. తప్పుడు ప్రచారాలు చేయకండి అని మీడియాకి విజ్ఞప్తి చేశారు చిరు. అయితే చిరు కామెంట్స్ తర్వాత మెగా అభిమానులు కాస్త కుదుట పడ్డారు.
ఇక అంజనమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వచ్చిన తర్వాత మెగా అభిమానులు అందరు ఒక్కసారైన అంజనమ్మని చూపిస్తే బాగుండు కదా అని అనుకున్నారు. అయితే మార్చ్ 8 ఉమెన్స్ డే అని తెలిసిందే. ఈ క్రమంలో మెగా స్పెషల్ ఇంటర్వ్యూ రాబోతుంది. చిరంజీవి తల్లి అంజనమ్మ తన పిల్లలు చిరంజీవి, నాగబాబు, విజయ దుర్గలతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా, ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసారు. ఫుల్ ఇంటర్వ్యూ రేపు రిలీజ్ కానుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అందరూ తమ తల్లితో చిన్నప్పుడు ఉన్న మెమరీలు పంచుకున్నారు కొడుకు , కూతుర్లు.
అంతేకాకుండా వారి లైఫ్ లో తమ తల్లి ఎంతలా సపోర్ట్ చేసిందో చెప్పారు. నాగబాబు అంజనమ్మకు ఫేవరేట్ చైల్డ్ అని చిరంజీవి అన్నారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోని చాలా బాగుండటంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో నలుగురు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ పవన్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఉంటే నిండుగా ఉండేది కదా అని కామెంట్ చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా బిజీ అయ్యారు.