చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఆగస్ట్ 11న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రం నుంచి చిరంజీవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గెటప్‌లో కనిపిస్తున్నారు. ఈ వింటేజ్ లుక్ పోస్టర్స్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
‘కోల్‌కతాలో మొదలయ్యే కొత్త షెడ్యూల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నాం. అనంతరం చిరంజీవి, తమన్నాలపై యూరప్‌లో ఓ పాటను చిత్రీకరిస్తాం. యూరప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ైక్లెమాక్స్ షూట్‌తో పాటు భారీ సెట్సాంగ్ను తెరకెక్కిస్తాం. జూన్ నెలాఖరు వరకు షూటింగ్ పూర్తవుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, ప్రొడక్షన్ డిజైనర్: ఏ.ఎస్.ప్రకాష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.