Mark Shankar | మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నాలెజినోవా దంపతులకు కలిగిన రెండో సంతానం. పవన్ కల్యాణ్‌కి మొత్తం నలుగురు పిల్లలు ఉండగా, అందులో రేణూ దేశాయ్‌కి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. అలానే అన్నా లెజినోవాకి కూడా అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే మార్క్ శంకర్ అందరిలో చిన్నవాడు. సింగపూర్ స్కూల్ లో చదువుకుంటుండగా, ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డట్టు తెలుస్తుంది. రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో మార్క్ శంకర్ చదువుతున్నాడు.
ప్రమాదంలో మార్క్ శంకర్‌కు చేతులు, కాళ్లకు గాయాలుకాగా.. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు చిన్నారి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. సింగపూర్ స్కూల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయలవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఈఘటనతో తాను దిగ్భ్రాంతికి లోనైనట్లుగా తెలిపారు. మార్క్ శంకర్ పవనోచ్ త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)దారా తెలిపారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. “సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను, అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా.. పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు. . 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు.. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అని చిరంజీవి తెలిపారు.