Bhanuchander | చిరంజీవి నాకు జూనియర్..రజినీకాంత్ మా అందరికీ స్పూర్తి: భానుచందర్
సీనియర్ యాక్టర్ భానుచందర్ (Bhanuchander) ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నాడు భానుచందర్ .
తెలుగుతోపాటు వివిధ భాషా సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అలనాటి నటుడు భానుచందర్ (Bhanuchander). ఈ సీనియర్ యాక్టర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చిన మాటలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన విషయాలు పంచుకున్నాడు. తాను ముంబైలో ఉన్న రోజుల్లో మ్యూజిషియన్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నాడు. తనకు అదే సమయంలో డ్రగ్స్ అలవాటు కూడా అయిందని, మార్షల్ ఆర్ట్స్ వల్లే డ్రగ్స్ నుంచి బయట పడగలిగానని అన్నాడు.
సినిమా ప్రయత్నాల గురించి చెప్పుకొస్తూ.. నాన్న మ్యూజిక్ డైరెక్టర్..ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో అమ్మ నేనుయాక్టర్ను కావాలని అమ్మ కలలు కనేది. అలా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరి శిక్షణ తీసుకున్నా. ఇనిస్టిట్యూట్‌లో నాకు రజినీకాంత్ (Rajinikanth) సీనియర్, చిరంజీవి (Chiranjeevi) జూనియర్. చిరు, నేను అప్పట్లో రూమ్ షేర్ చేసుకున్నాం. మా అందరికీ స్పూర్తి రజినీకాంతేనని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో వచ్చిన సింహాద్రి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. ఈ సినిమా చేస్తున్నపుడు..ఈ సినిమా సూపర్ హిట్ అని, నువ్వు సెన్సేషనల్ డైరెక్టర్వు అవుతావని చెప్పాను. ఇపుడదే జరిగింది. సినిమాను ఎలా తీయాలో..దాన్ని ఎలా ప్రమోట్ చేసి..మార్కెటింగ్ చేయాలో తెలిసిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అని..నార్తిండియాలో కూడా ఆయనను మించిపోయే డైరెక్టర్ లేడని ఆకాశానికెత్తేశాడు భానుచందర్.
Read Also : Chiru 154 | చిరంజీవి-బాబీ సినిమా షెడ్యూల్‌పై క్రేజీ అప్ డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

