Chiranjeevi | తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్యాన్స్ అనే పదం వింటే ఈ తరానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ పేర్లు గుర్తుకొస్తాయి. కానీ, ఈ ప్రయాణానికి బాట వేసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టి, చిన్నా చితకా పాత్రలతో మొదలైన ఆయన ప్రస్థానం… నేడు తెలుగు సినిమాకు ఓ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. చిరంజీవి చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి గౌరవాలతో సత్కరించింది. ఆయన కెరీర్లో ఇప్పటివరకు 156 సినిమాల్లో 537 పాటలకు నృత్యం చేశారు. ఈ పాటల్లో 24,000కి పైగా డ్యాన్స్ మూవ్స్ చేశారని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కింది. నిజంగా చెప్పాలంటే డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అనే స్థాయికి ఎదిగారు.
ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు. కానీ ఈ వయసులోనూ ఆయనలోని డ్యాన్స్ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఇటీవల మరోసారి నిరూపించారు. ఓ ప్రముఖ ఛానల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరు, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రంలోని “చామంతి పువ్వా పువ్వా” పాటకు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పూర్తి వీడియో విడుదలైతే ఇంకెంత హడావుడి ఉంటుందో అని ఊహాలోచన చేస్తున్నారు. 90వ దశకంలో చిరంజీవి డ్యాన్స్‌లు చూసి ప్రేక్షకులు మైమరచిపోయేవారు. అప్పట్లో చిరంజీవి సినిమా అంటే హంగామా మాములుగా ఉండదు. థియేటర్లను పూలతో, పాలతో అభిషేకించేవారు. టిక్కెట్ల కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపించేవి.
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనే ఉత్సాహం అసలు మాటల్లో చెప్పలేనిది. థియేటర్లో చిరు డ్యాన్స్ చేస్తే, ఈలలు, కేకలతో హాల్ కంపించిపోయేది. చిరంజీవి ఏర్పాటు చేసిన మార్గమే ఈ తరం హీరోలకు ప్రేరణ అయ్యింది. నాలుగు తరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, ఇప్పటికీ తన చరిష్మా కోల్పోకుండా ముందుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ మరింత పెరిగిపోతోంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. త్వరలో విశ్వంభర సినిమాతో పాటు అనీల్ రావిపూడి సినిమాతో సందడి చేయనున్నాడు. ముఖ్యంగా అనీల్ రావిపూడి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Megastar @KChiruTweets set the stage on fire with his timeless grace and energy at the grand 30-year anniversary celebration of @etvteluguindia. 🔥🕺
A true legend who never misses a beat! 👑#Megastar #Chiranjeevi pic.twitter.com/MFAcnRGcgn
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 2, 2025