కికు మనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న విభిన్న కథాచిత్రం ‘చిరంజీవి’. శుభసాయి వెంకట్ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మెగా బ్రదర్ నాగబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి నాగబాబు శుభాకాంక్షలు అందించారు. కుడివైపు గుండె ఉండే అరుదైన యువకుడు చిరంజీవి.
ఈ కారణంగా అతను ఎలాంటి సంఘర్షణలను ఎదుర్కొన్నాడు? ఎలాంటి సవాళ్లను స్వీకరించాడు? ఈ అరుదైన పరిస్థితి నుంచి ఎలా తట్టుకుని నిలబడ్డాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. ఆసక్తికరంగా, ఆదర్శవంతమైన కథతో దర్శకుడు శుభసాయి సినిమాను తెరకెక్కించాడని, ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామకృష్ణ, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: కికు ఎంటర్టైన్మెంట్స్.