Chiranjeevi | టాలీవుడ్ యాక్టర్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విక్టరీతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అనంతరం ఢిల్లీ NDA సమావేశంలో పాల్గొని హైదరాబాద్‌కు తిరిగొచ్చిన జనసేనాని మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌పై కుటుంబసభ్యులు పూల వర్షం కురిపిస్తూ.. హారతినిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పవన్ కల్యాణ్‌పై భారీ పూలమాల వేసిన చిరంజీవి ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశాడు. అనంతరం కుటుంబసభ్యులంతా కలిసి పవన్ కల్యాణ్‌తో కేక్ కట్ చేయించారు. పవన్ కల్యాణ్ విజయాన్ని మెగాబ్రదర్స్ అండ్ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Janasena Chief #PawanKalyan arrives at his Brother Megastar #Chiranjeevi‘s residence after a historic win. pic.twitter.com/NwYJg1fOYr
— Vamsi Kaka (@vamsikaka) June 6, 2024