ఇవాళ మెగాస్టార్ మాతృమూర్తి అంజనా దేవి పుట్టిన రోజు. అమ్మ పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఈ పుట్టిన రోజుకు అమ్మను కలవలేకపోయారు చిరంజీవి. కారణం ఆయన ఈ మధ్య కరోనా బారిన పడి హోం క్వారెంటైన్ లో ఉన్నారు. పుట్టిన రోజున ఆశీస్సులు తీసుకోలేకపోయిన చిరు సోషల్ మీడియా ద్వారా ఆ బాధను పంచుకున్నారు.
అమ్మా జన్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నాను. నీ దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకు కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ అభినందనలతో శంకరబాబు. అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో శంకరబాబు అని చిరు తన సొంత పేరు శివశంకర వరప్రసాద్ ను గూర్తు చేశారు. చిరంజీవి భావోద్వేగ ట్వీట్ అభిమానులను హత్తుకుంటోంది. ప్రస్తుతం కరోనా వల్ల మెగాస్టార్ తను నటిస్తున్న సినిమాల షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు.
అమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p