Chiranjeevi: రోశయ్య మృతికి సంతాపం తెలిపిన చిరంజీవి…!

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అకాల మరణం అందరిని కలిచి వేసింది. శనివారం (డిసెంబర్ 4) ఉదయం లోబీపీ రావడంతో ఆయనను కుటుంబసభ్యులు వెంటనే బంజారాహిల్స్లోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధాప్యం కారణంగా రోశయ్య చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారు. రోశయ్య మృతిపట్ల ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా సంతాపం తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచారుడి వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆ ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కలింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య గారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేసి చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తరపున 1968లో తొలిసారి శాసన మండలికి రోశయ్య ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగాకు ఈయయ శిష్యుడు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మొత్తంగా 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన రికార్డ్ ఆయన సొంతం. హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 14 నెలలు పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2011లో తమిళనాడు ముఖ్యమంత్రిగానూ పని చేశారు.
Shri #KonijetiRosaiah Garu #RestInPeace pic.twitter.com/jp8KPuWCuJ
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 4, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

