Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి గురువారం చిత్ర పురి కాలనీలో నూతన గృహా సముదాయాన్ని ప్రారంభించాడు. లబ్దిదారులకు ఇంటిపత్రాలు, తాళాలను అందజేశాడు. అనంతరం మెగాస్టార్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. సినీ పరిశ్రమలో తను పెద్దను కానని, కొందరు చిన్న వాళ్ళుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద వాడ్ని చేస్తున్నారని వెల్లడించాడు. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఇలా సినీ కార్మికులకు గృహా సదుపాయం ఇండియాలో ఎక్కడా లేదని, ప్రభాకర్ దూరదృష్టి వల్లే కార్మికుల సొంతింటి కల సాకారం అయిందని కొనియాడాడు.
చిరు సినిమాల విషయానికొస్తే ఈ ఏడాది ప్రారంభంలోనే ఆచార్యతో పెద్ద దెబ్బ తగిలింది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ నెలలో రిలీజైన ఈ సినిమా బడ్జెట్లో సగం కూడా రికవరీ చేయలేకపోయింది. ఇక ఇటీవలే విడుదలైన గాడ్‌ఫాదర్ కూడా కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలింది. ప్రస్తుతం చిరు ఆశలన్నీ వాల్తేరు వీరయ్య పైనే ఉన్నాయి. కొల్లి బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జవవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. రవితేజ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మిస్తుంది.