‘ఆర్ యూ రెడీ’ అంటూ పబ్ సాంగ్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం తెరకెక్కించిన ఈ మెగావిక్టరీ మాస్సాంగ్ను మంగళవారం గుంటూరులో విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. తాజాగా విడుదల చేసిన ఈ పాటలో చిరు-వెంకీ కాంబో తమదైన ైస్టెల్, గ్రేస్‌తో అభిమానుల్ని ఆకట్టుకున్నారు.
ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరూ సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని కాసర్ల శ్యామ్ రచించారు. ‘ఏంటి బాసూ సంగతీ..అదిరిపోద్దీ సంక్రాంతీ, ఏంటి వెంకీ సంగతీ..ఇరగతీద్దాం సంక్రాంతి’ వంటి హుషారైన చరణాలతో ఈ పాట ఆద్యంతం జోష్ నింపింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్.ప్రకాష్, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.