Mega154 story | ఈ రోజుల్లో ఒక సినిమా తెరకెక్కించడం కాదు.. దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అయిపోతుంది. మరీ ముఖ్యంగా విజువల్స్ బయటికి వస్తున్నాయి. విడుదలకు ముందే టీజర్ బయటకు వస్తుంది.. ట్రైలర్ ఆన్ లైన్లో లీక్ అయిపోతుంది.. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇది తప్పడం లేదు. ఇక విడుదల రోజే పైరసీ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. ఇలా ప్రతి క్షణం భద్రత లేమితోనే ఇండస్ట్రీ భయపడుతుంది. తాజాగా చిరంజీవి సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కె.ఎస్.రవీంద్ర ఉరఫ్ బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.
చిన్నతనం నుంచి చిరంజీవికి బాబీ వీరాభిమాని. తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో గాల్లో తేలిపోతున్నాడు ఈయన. మెగాస్టార్ ఇమేజ్‌కు సరిపోయే ఒక అద్భుతమైన కథ సిద్ధం చేసి.. దాన్ని ఈ మధ్య సెట్స్‌పైకి తీసుకువచ్చాడు ఈ దర్శకుడు. స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం ఈయన సొంతం. అందుకే చిరంజీవి సినిమాను కూడా అద్భుతంగా డీల్ చేస్తాడు అని నమ్ముతున్నారు మెగా అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇందులో వింటేజ్ చిరంజీవి కనిపిస్తున్నాడు అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు చిరంజీవి సినిమా మంచి కోరుకునే కమర్షియల్ అంశాలు అన్నీ సినిమాలో ఉంటాయని ఇప్పటికే చెప్పాడు బాబీ. కచ్చితంగా పూనకాలు తెప్పించే సినిమా ఇది అంటున్నాడు.
ఇదిలా ఉంటే మెగా154 సినిమా కథ ఇదే అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్వెల్ ముందు ఈ ట్విస్ట్ ఓపెన్ అవుతుందని.. అప్పటి వరకు ఒక పని మీద చిరు మారువేషంలో ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఎక్కువగా సముద్రతీరంలోనే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2022 దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్ ఎవరో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మాస్ రాజా రవితేజ అత్యంత కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mega154: బాబీ మూవీ సెట్ లో చిరంజీవి.. ఎమోషనల్ అయిన దర్శకుడు
LOBO: చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడంతో కన్నీళ్లు పెట్టుకున్న లోబో
Ravi Teja: చిరు సినిమాలోని కీలక పాత్ర కోసం రూ.7 కోట్ల రూపాయలు చార్జ్ చేస్తున్న రవితేజ
Chiranjeevi: మెగాస్టార్ ఆల్‌టైం రికార్డ్.. ఒకే నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్‌తో బిజీ
Suriya Fight With Chiranjeevi | చిరంజీవితో తాప్సీ, సూర్య పోటీ పడనున్నారా..?