LOBO: చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడంతో కన్నీళ్లు పెట్టుకున్న లోబో

ఒకప్పుడు చిన్నా చితకా షోస్ చేసుకుంటూ ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన లోబో రీసెంట్గా బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు. సీజన్ 5లో పాల్గొన్న ఆయన తన కామెడీతో హౌజ్‌మేట్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. సీక్రెట్ రూంలో ఉన్నా కూడా గేమ్‌ని మార్చుకోలేక బయటకు వచ్చేశాడు లోబో. బయటకు వచ్చాక మనోడికి సినిమా ఆఫర్స్ కూడా తలుపుతడుతున్నాయి. తాజాగా లోబోకి చిరు సినిమి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.
టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి- మెహర్ రమేష్ దర్శకత్వంలోభోళా శంకర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.
తమిళ ‘వేదాళం’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. కీర్తి సురేశ్ చిరు సోదరిగా కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రీసెంట్గా యాక్షన్ సన్నివేశాలకి సంబంధించిన షూట్ కూడా పూర్తి చేసినట్టు ఇటీవల మేకర్స్ తెలియజేశారు. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్, బాబీ సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bhola shankar
- Chiranjeevi
- Lobo
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

