Chiranjeevi Special video | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్‌లను కూడా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఇక చిరంజీవికి ఆంజనేయస్వామి అంటే అమితమైన భక్తి. పలు సినిమాలలో కూడా చిరు ఆంజనేయ స్వామి రిఫరెన్స్‌ను వాడుకున్నాడు. కాగా ‘హనుమాన్ జయంతి’ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చిరు ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
చిరు విడుదల చేసిన వీడియోలో రామ్‌చరణ్ ‘ఆచార్య’ షూటింగ్ సమయంలో మేకప్ వేసుకుంటుండగా చరణ్ దగ్గరకి ఒక కోతి వచ్చింది. చెర్రీ ఆ కోతికి తినడానికి బిస్కెట్స్ ఇస్తున్నాడు. ఆ కోతి కూడా బిస్కెట్లను తింటూ చరణ్ దగ్గరే కూర్చుంది. ఈ వీడియోకి శ్రీఆంజనేయం స్తోత్రాన్ని జోడించి చిరంజీవి ఇన్ట్సాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆచార్య ఏప్రిల్29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేసే పనిలో ఉంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 23న విజయవాడలో జరుపనున్నట్లు తెలుస్తుంది.