శ్రీరామ్, మహిమా గుప్త జంటగా నటిస్తున్న చిత్రం ‘చింతామణి సొంతకథ’. ప్రేమ్‌రాజ్ దర్శకుడు. బి.రాజీవ్‌కుమార్, రాకేష్ కర్రె, డా.ఎన్వీరావు, శ్రీనివాస్ పసుపులేటి నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ అద్దంకి దయాకర్ క్లాప్ ఇవ్వగా, జీహెచ్ఎంసీ రిటైర్డ్ అసిస్టెంట్ కమీషనర్ వందనకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. సోషల్ యాక్టివిష్ట్ డా.శ్రీనివాస్ తొలిషాట్‌కి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు కాశీ విశ్వనాథ్, రచయిత నివాస్ కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందించారు.
అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కథలోని స్ట్రాంగ్ కంటెంట్ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు చెప్పారు. కమర్షియల్ పంథాలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇదని , ఇందులో భార్యభర్తల డ్రామా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.