రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ స్టార్హీరో విజయ్, త్వరలో సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను నటిస్తున్న చివరి సినిమాగా ‘The GOAT’ సినిమాను ప్రకటించారాయన. ‘The Greatest of all time’ అనేది ఉపశీర్షిక. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు కూడా మంచి స్పందన వస్తున్నది. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ మెలొడీ సాంగ్‌ని యువన్‌శంకర్‌రాజా, రాజా భవతారిణిలతో కలిసి విజయ్ కూడా ఆలపించడం విశేషం. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రూ పొందుతోన్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవ, మీనాక్షి చౌదరి మోహన్, జయరాం, స్నేహ, లైలా తదితరులు ఇతర పాత్రధారులు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.