Chinmayi Sripada | ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోపాటలు పాడటంతో పాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి తనవంతుగా గొంతు వినిపిస్తూ వస్తుంది. సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఇప్పటికే చాలాసార్లు తన మద్దతును తెలిపింది. గతంలో లిరిక్ రైటర్ వైరముత్తుపై కూడా లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసింది. ఇదిలావుంటే తాజాగా అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన ఒక వివాదాస్పద తీర్పుకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి.
ఒక రేప్ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్ట్ తీర్పును ఇస్తూ.. ఒక స్త్రీ యొక్క స్తనాలను(Grabbing Breasts) పట్టుకోవడం లేదా ఆమె పైజామా స్ట్రింగ్‌ను(Snapping Pyajama String) లాగడం రేప్ (బలాత్కారం) ప్రయత్నంగా పరిగణించబడదని పేర్కొన్నది. ఈ కేసు 2021లో జరిగిన సంఘటనకు సంబంధించినది కాగా.. పవన్, ఆకాశ్ అనే వ్యక్తులు ఒక 11 ఏళ్ల చిన్నారిని లైంగికంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రాసిక్యూషన్ ప్రకారం, నిందితులు బాధిత చిన్నారి స్తనాలను పట్టుకుని, ఆమె పైజామా స్ట్రింగ్‌ను విరిచిపెట్టే ప్రయత్నం చేసి, ఆమెను ఒక కల్వర్ట్ క్రింద లాగే ప్రయత్నం చేశారు. కానీ చుట్టుపక్కన ఉన్న ప్రజలు చూసి ఆ బాలికను కాపాడరు. అయితే ఈ విషయంపై పవన్, ఆకాశ్‌పై రేపు కేస్ నమోదు అవ్వగా.. హైకోర్ట్ స్పందిస్తూ.. ఈ చర్యలు రేప్‌గా పరిగణించలేమని తెలిపింది. దీనిని పోక్సో చట్టం కింద లైంగికదాడిగా పరిగణించవచ్చని వెల్లడించింది. ఇక అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పెద్ద వివాదానికి దారి తీసింది. పలు సంఘాలు సామజిక కార్యకర్తలు ఈ తీర్పును తప్పుబడుతున్నారు.
మరోవైపు ఈ తీర్పుపై చిన్మయి శ్రీపాద స్పందిస్తూ.. ఇండియా రేప్ క్యాపిటల్ అవ్వడానికి ఇది ఒక కారణం. మీకు సామర్థ్యం ఉంటే లేదా మీకు అవకాశం ఉంటే.. మీ కూతురితో కలిసి ఇండియా వదిలి వెళ్లిపోండి. లేదా మీ కూతురుని అయిన ఇండియాను వదిలి వెళ్లమనండి. మీ కూతుర్లను రక్షించుకోవడానికి అదొక్కటే మార్గం ఉంది. అంటూ చిన్మయి రాసుకోచ్చింది.
Rape Capital for a reason.
If you have means and if you can, leave the country with your daughter. Or ask your daughter to leave the country.
This is the only way to Bachao your Betis. pic.twitter.com/eSf13jDFmK
— Chinmayi Sripaada (@Chinmayi) March 19, 2025